ఎరుకుల

 

పరిచయం

భారతదేశ ప్రాచీన చరిత్ర నుండి ప్రజల యెుక్క సామాజిక స్దితి గతులు కుల వ్యవస్ధ ఆధారంగ నిర్ణఇంచబడి, నేటి ఆధునిక సమాజము లొ మరింతగ బలపడి కొనసాగుతున్నది. మన భారతదేశనికి కుల వ్యవస్ధ , సామాజిక జీవితంలొ ప్రతి దినము అనేక రుపాలలొ వ్యక్తమవుతుంది. అనేక కారణల రీత్యా జనాభ తక్కువగా ఉన్న మరియు వృత్తుల కారణముగా అడవి ప్రజలను నిమ్న జాతి లేక దిగువ స్దాఇ కులాలుగా భారత దేశ వ్యవస్దలొ నిర్ణించటమైనది. నిజానికి అడవి ప్రజలు స్వతంత్రులుగా మరియు సమాజనికి అవసరమైన ఉత్పత్తులు అందించేవారిగా ఉన్నారు. నేటి ఆధునిక సమాజ నిర్మాణము , అది రాజకీయమైన, ఆర్దికమైన,సాంఘీకమైన ,కుల వ్యవస్థ ఆథారముగా నడిపించబడుతున్నది. ఇట్ఠి వ్యవస్థలొ ప్రాచీన చరిత్ర మొదలుకొని బ్రిటీఘ వారి పాలన ముందు వరకు స్వతంత్రముగా, ఉన్నతముగా జీవించిన ఎరుకుల జాతి ప్రజల విశిష్టతను తెలియచెయటము చారిత్రక అవసరముగా అనేకమంది చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రత్యేకమైన ప్రజలుగా, విద్యలొ నిపుణులుగా ఎరుకుల జాతి ప్రజలను ప్రాచీన చరిత్రలొ వ్రాయబడియున్నది. అట్టి చరిత్ర,విశిష్టత తెలియచేయటము ఈ వెబ్ సైటు యెుక్క ప్రాదమిక ఉదేశ్యము, తద్వార ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎరుకుల ప్రజలను చైతన్య పరచటము మరియు ఐక్యపరచటము జరుగుతున్నది. ఈ వెబ్ సైటు లొ పొందుపరిచియున్న ప్రతి సమాచారము తప్పనిసరిగా చదవండి, ఇతరులకు తెలియచెయండి. మీ సలహలు, సుాచనలు మాకు ఎంతొ ఉపయోగకరము. ప్రభుత్వ, ప్రవేటు రంగాలలొ పని చేస్తున్నవారు తప్పనిసరిగా మీ పేరు, చిరునామ ఈ వెబ్ సైటు లొ నమోదు చేసుకోనగలరని కోరుచున్నాము( లేక) క్రింద ఇవ్వబడిన బాక్సు (comments)లొ వ్రాయండి. తద్వార ఎరుకుల జాతి లోని అనేక బీద ప్రజలకు మీరు సహయము చేయగలరు. మరియు గ్రామీణ, పట్టణ ప్రాంత సమస్యలను సంభాషణ అనే చర్చా భాగములో తప్పనిసరిగా వ్రాయండి,( లేక) క్రింద ఇవ్వబడిన బాక్సు (comments)లొ వ్రాయండి. మీ చిరునామ,ఫోన్ నంబరు తప్పనిసరిగ వ్రాయండి , తద్వార ఇతరులు మీ సమస్యలకు స్పందించటము జరుగుతుంది.మీ ప్రాంతములో స్ధానిక సంఘములుగా ఎర్పడాలని కోరుచున్నాము , అట్టి వివరాలు మాకు తెలియచేయండి, ప్రచురిస్తాము.( లేక) క్రింద ఇవ్వబడిన బాక్సు (comments)లొ వ్రాయండి.

 • సమాచారం కోసం క్రమం తప్పకుండా ఈ వెబ్ సైట్ చూడండి మరియు ఎరుకుల కుటుంబాలకు చెప్పండి (మేము పూర్తి వెబ్ సైట్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము,మీరు కలిగిన సమాచారం పంపండి )

చరిత్ర

భారత దేశ ప్రాచీన చరిత్ర పరిశీంచినచో ఎరుకుల జాతి ప్రజల యక్క ప్రస్థావన మహభారతములో వ్రాయబడి ఉన్నది. ఎకలవ్యుడు మరియు ద్రోణాచార్యుడి యెుక్క గురు శిష్యుల చరిత్ర వివరముగా వ్రాయబడి ఉన్నది.నిమ్న జాతికి చెందిన ఎకలవ్యుడను గురుకులము ( పాఠశాల) లో చదువుకునేందుకు ద్రోణాచార్యుడు తిరస్కరించటము మరియు ఎకలవ్యుడు అట్టి తిరస్కారాన్ని అనుభవిస్తుా, కేవలము గురువు బోమ్మ ఎదుట అరణ్యములో విద్యను అభ్యశించి, పంచ పాండవులలో ఓక్కడైన అర్జుడను మించి విలు విద్య లో ప్రతిభ కలిగి ఉండటము మహభారతములో చదువుతాము.భారత దేశ ఆధునిక చరిత్రకారుల అభిప్రాయము ప్రకారము అనేక చారిత్రక కట్టడాల మీద కాకతీయులు సంచార జాతికి చెందిన ఎరుకుల జాతికి చెందిన వారిగా పేర్కోన్నారు. ప్రాచీన చరిత్ర పరిశీంచినచో మహభారతములో ఎకలవ్యుడు చరిత్ర ఎంతో ఉత్తేజపుారితము ఉంటుంది.ఎకలవ్యుడు ( నిషిధ ఉత్తర భారత ధేశము, తెలుగులో ఎరుకుల). ప్రాచీన ఎరుకుల జాతి ప్రజలు వేట వృత్తి లో అసమాన ప్రతిభ కలిగి ఉన్నారు. వారు వేగముగా పరుగెత్తె జంతువులను, పక్షులను ఎంతో నైపుణ్యముతో వేటాడెవారు. అనేకమంది చరిత్రకారుల అభిప్రాయము ప్రకారము వరంగల్ మరియు బస్తర్ కాకతీయ రాజులు ఎరుకుల జాతి ప్రజలని తెలియచేసారు.మహభారతములో పేర్కోన్న నిషిధ జాతి ఉత్తర భారత ధేశము లోని ద్రవిడ భిల్లుల ఉపజాతి .భారతము మరియు రామాయణ కాలములో ద్రవిడ జాతి ప్రజలు సింధు ప్రాంతము నుండి శ్రీలంక వరకు వ్యాపించియున్నారు, వారు తెలుగు మరియు తమిళ భాషల యెుక్క మిశ్రమ భాష మాట్లాడేవారు. భారతము లో పేర్కోన్న ఎకలవ్యుడు తెలుగులో ఎరుకులగా పిలుస్తారు.ఎరుకుల అనగా భవిష్యత్తు తెలియచేసేవారని అర్దము.భారత దేశ ప్రాచీన చరిత్ర లో అతి గోప్ప వీరులను వారు ప్రదర్శించే విలు విద్య ఆధారముగా గుర్తిస్తారు.మహభారతములో విలు విద్యలో అత్యంత ప్రతిభ కలిగినవారు ఎకలవ్యుడు మరియు అర్జునుడు మాత్రమె.

రామాయణములో భిల్లు జాతి బంధిపోటుగా ఉన్న వాల్మికి తన మనస్సు మార్చుకోని రుషి గా మారి రామాయణము వ్రాసాడు. అది వాల్మికి రామాయణముగా నేటికి మన భారతదెశములో అందరు చదువుతారు.ఎకలవ్యుడు నిషిధ యువరాజుగా ద్రోణాచార్యుడు యెుక్క గురుకులములోనికి ప్రవేశానికి కోరినప్పుడు క్షత్రియులకి మాత్రమె ప్రవేశము అనే నిభంధనతో ద్రోణాచార్యుడు తిరస్కరించటము మన అందరికి తెలిసిన విషయమే.మహభారతములో నిషిధ లేక సంచార జాతిని అడవి వేటగాళుగా పేర్కోన్నారు. రామాయణము పరిశిలించినచో నిషిధ జాతికి చెందిన గుహ అనే రాజు రాముడికి సన్నిహిత మిత్రుడుగా ఉండటము గమనిస్తాము. ఎకలవ్యుని తండ్రి దేవశ్రవుడు.దేవశ్రవుడు వాసుదేవునికి సోదరుడు, వాసుదేవుడు శ్రీ కృఘ్ణనికి తండ్రి .

విలు విద్యలో పట్టుదల, ఎకాగ్రత, నిరంతర అబ్యాసము ద్వార ప్రతిభ కనబరుస్తున్న ఎకలవ్యుని ద్రోణాచార్యుడి యెుక్క కుటిల నీతి కారణముగా మరియు గురుకులములో విలు విద్యను అభ్యశిస్తున్న అర్జునుడికి సాటిగా మరోకరు ఉండరాదు అనె ఈర్ష కారణముగా అర్జునుడి యెుక్క కోరిక మేరకు ద్రోణాచార్యుడు ఎకలవ్యుని వద్దకు వెళ్లి తనకు గురు ధక్షిణగా కుడి చేతి భ్రోటన వ్రేలు ఇవ్వమని కోరటము అందుకు అంగీకరించిన ఎకలవ్యుడు విలు విద్యకు అత్యంత అవసరమైన తన కుడి చేతి భ్రోటన వ్రేలు ఇవ్వటము భారతములో వ్రాయబడిఉన్నది.ద్రోణాచార్యుడి ఇట్టి కుటిల నీతి వెనుక మరోక కారణము ఎకలవ్యుడు పాండవులకు శత్రు శిభిరమైన జారసంధుని యెుక్క ఆస్దానములో చేరటానికి అవకాశము ఉన్నదని భావించటము.ఎకలవ్యుడి తండ్రి జారసంధునితో కలసి పని చేయటము భారతములో వ్రాయబడి ఉన్నది.భారతములో హిడంభి అనె స్త్రీ హిడంభ సోదరిగా వ్రాయబడి ఉన్నది. హిడింబి పాండవులలో ఓకడైన భీముడిని వివాహము చేసికోనగా వారికి అత్యంత బలశాలి అఇన ఘటోత్కజుడు జన్మించినట్లు పేర్కొన్నారు.

ఆధునిక చరిత్ర

అనేక మార్పులు మరియు సంవత్సరాలు గతించిన తరువాత ఎరుకుల జాతి ప్రజలు అడవికి పరిమితమై అటవీ ఉత్పత్తులు మరియు వేటాడము ద్వార జీవనము సాగించేవారు. భ్రీటీషు వారి పాలనలో 1878 సంవత్సము అటవీ ఉత్పత్తులను ఉపయెాగించటము మరియు వేటాడము నిషేదించిన కారణముగా ఎరుకుల జాతి ప్రజలు మైదాన ప్రాంతములకు (గ్రామాలకు) విస్తరింటము జరిగినది. ఆ కారణముగా ఎరుకుల ప్రజలు అడవి సంపద మీద హక్కులు కోల్పోఇ మైదాన ప్రాంతములలో నివశించుట వలన గ్రామ సమాజములో కనీస సౌకర్యాలు , గౌరవము పోందలేక పోయారు. 1911 సంవత్సము భ్రీటీషు పాలకులు ( నేటి చెనై పట్టణము అధికారులు) ఎరుకుల జాతి ప్రజలను నేరస్తుల యెుక్క జాబితాలో చేర్చినారు. అప్పటి నుండి భ్రీటీషు వారి కాలములో దుర్బర దారిద్రము ఎరుకుల జాతి ప్రజలు అనుభవించినారు. భారతదేశనికి స్వాతంత్రము వచ్చిన తరువాత 1952లో అట్టి నేరస్తుల జాబితాలో నుండి ఎరుకుల జాతిని తోలగించటము జరిగినది. కాని నేటికి కూడ అనేక ప్రాంతాలలో ఎరుకుల జాతి ప్రజలు దుర్బర దారిద్రము అనుభవించుచున్నారు.భ్రీటీషు పాలనలో ఎరుకుల జాతి ప్రజలు వ్యవసాయ కూలిలుగా మరియు చిన్న వర్తకులుగా మరియు చాపలు అల్లటము ,బుట్టలు, తయారు చేయటము ద్వార జీవనము సాగించేవారు. ఈ కాలములో అనేకమంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మరి కోంతమంది ఆర్దిక స్వాతంత్రము అనుభవిస్తున్నారు. కాని భారతదేశనికి స్వాతంత్రము వచ్చి 66 సంవత్సరాలు గడచినా ఇప్పటికి అనేక ప్రాంతాలలో ఎరుకుల జాతి ప్రజలు సమాజములో అణచివేతకు , అవమానలకు గురై భాధలు అనుభవిస్తున్నారు.

గణాంకములు

నివాసము : మైదాన ప్రాంతాలు , కోండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు.

జీవనాధరము వ్యవసాయము, చేతి వృత్తులు,జంతు పోషణ.

అక్షరాశ్యత 1991 లెక్కల ప్రకారము 25.74%

జనాభ

ఆంద్రప్రదేశ్ 531000

తమిళనాడు 13000

ఓరిస్సా 1800

కర్ణాటక 1200

మహరాష్ట 600

ఢిల్లి 200

గుజరాత్ 200

పాండిచేరి 200

చత్తీస్గఢ్ 200

జార్ఖండ్ 87

భాష

ఎరుకుల ప్రజలు తమ స్వంత భాష అఇన ఎరుకుల భాషను ఉపయెాగిస్తారు, దానిని కుర్రు భాష లేక కులవత అంటారు, ఇది రవుల మరియు ఇరుల అనే ధ్రవిడ భాషకు సమీపముగా ఉంటుంది. ఆంద్రప్రదేశ్ లో ఎరుకుల భాషను తమ కుటుంభాలలో ఉపయెాగిస్తారు. రాయలశీమ, తెలంగాణ ప్రాంతాలలో ఈ భాషను ఎక్కువగా ఉపయెాగిస్తారు.ఎరుకుల జాతి ప్రజలు తమ ఉప వృత్తుల

ఆధారముగా విభజించబడినది. 1) దబ్భ ఎరుకుల ( వీరు బుట్టలను వెదురు పుల్లలతో తయారు చేస్తారు 2) ఈత పుల్లల ఎరుకుల (వీరు బుట్టలను ఈత పుల్లలతో తయారు చేస్తారు ) 3) కుంచపురి ఎరుకుల ( వీరు దువ్వెనలు తయారు చేస్తారు ) 4) పరికె ముగ్గుల ఎరుకుల ( వీరు భవిషత్ వాణి చెప్పటం ధ్వార జీవనము సాగిస్తారు )

5) కరివేపాకు ఎరుకుల ( ఆకు కుారలు అమ్ముట ధ్వార జీవనము సాగిస్తారు ) 6) ఉప్పు ఎరుకుల ( ఉప్పు అమ్ముట ధ్వార జీవనము సాగిస్తారు )

ప్రతి ఉప జాతి నాలుగు గోత్రములుగా విభజించబడినది 1) కావాడి 2) సాతుబడి 3) మానుబడి 4) మేండ్రగూతి .

ప్రతి గోత్రమునకు అనేక ఇంటి పేర్లు కలవు.( ఎ గోత్రమునకు చెందినవారు అనేది ఇంటి పేర్లు ఆధారముగా గుర్తిస్తారు )

కోరమ , కోరభ,కానిమాను, కనిహేలు, మరియు ఇతర పేర్లతో పిలువబడుచున్న కాణి చెప్పు వారు కూడ ఎరుకుల జాతి కి చెందిన వారు.

మతము

ఎరుకుల ప్రజలు హిందు దేవతలైన , శివుడు, వెంకటేశ్వరుడు, నరశింహస్వామి, నారయణస్వామి, రాముడు ఆరాధిస్తారు. మరియు పోలిమేర దేవతలైన అంకమ్మ, కోల్లపుర,సుంకలమ్మ, పోలేరమ్మ,ఎల్లమ్మ, అనే దేవతలను ఆరాధిస్తారు. ఎరుకుల ప్రజలు ప్రకృతి దేవతలైన సూర్యుడు, చంద్రుడు, మరియు అగ్ని పూజిస్తారు.హిందు పండగలను ఆచరిస్తారు. సంక్రాంతి, శివరాత్రి, శ్రీరామనవమి, దసర,ఉగాది పండగలను ఆచరిస్తారు. కోన్ని ప్రాంతాలలో హిందు ఆలయములలోనికి అనుమతి నిరాకరించుట వలన చెట్లు వద్ద రాతి బోమ్మలు, మట్టి బోమ్మలు పెట్టుకోని ఆరాధిస్తారు. ఎక్కువమంది ప్రజలు హిందు మతాన్ని పాటిస్తారు. ఐతే క్రైస్తవ మతము కూడ ఎరుకుల ప్రజలలో ప్రచారము పోందినది.

క్రైస్తవులు గా మారిన కూడ తమ స్వంత గుర్తింపుతో క్రైస్తవ మతము(లేక) పాటించే విధానము ధ్వార తమ ప్రత్యేకతను కాపాడుకోంటున్నారు.

సామాజిక పద్దతులు

ఎరుకుల ప్రజలలో సాధరణముగా కుటుంబ వ్యవస్ధ తండ్రి వారసత్వ సాంప్రదాయకముగా ఉంటుంది. వివాహలలో మేనరిక సంభందాలు అనుమతిస్తారు . ఎక భార్యత్వము కుటుంభ సాంప్రదాయక ప్రమాణము ఐతే కోన్ని ప్రత్యేక సందర్భములలో బహు భార్యత్వము అనుమతిస్తారు.వివాహలు సాధరణముగా చర్చల ద్వార , కానుకలు ( ఓలి ) ద్వార జరిపిస్తారు. సాంప్రదాయకముగా వివాహము ఐన స్త్రీ వివాహమునకు గుర్తుగా కంఠాభరణము ధరిస్తారు. ఈ కాలములో తాళి బోట్టు ,మంగళ సూత్రము ధరిస్తున్నారు. విడాకులు అనుమతిస్తారు కాని వ్యభిచారము, పిల్లలు పుట్టక పోవటము కారణముగా భార్య, భర్తలలో ఎవరైన విడాకులు కోరవచ్చు. వితంతువులు మరోక వివాహమునకు అర్హులు. కుటుంభ సమస్యలు చర్చల ద్వార లేదా కుల పంచాఇతి ద్వార పరిష్కరిస్తారు. ఎరుకుల కుటుంబ వ్యవస్థను నడిపించటానికి సామాజికముగా వారికి క్రమ శిక్షణ పద్ధతులు ఉన్నాఇ. వాటిని కుల పంచాఇతి అంటారు. కుల పంచాఇతి లో అనేక మంది అనుభవము కలవారు ఉంటారు. వారికి అనుభశాలి , కుల వ్యవస్థను గూర్చిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నాయకుడుగా ఉంటారు. కుల పంచాఇతి కుటుంభ తగాదాలు, నేరాలు, వ్యభిచారము, అప్పులు, ఆస్తి వివాదాలు, భూ వివాదము లు పరిష్కరిస్తుంది. ఈ కుల పంచాఇతిలో నేర నిర్ధారణ కోన్ని పద్ధతుల ఆధారముగా జరుగుతుంది. 1) వేడి నూనెలో చేతిని ముంచటము ద్వార 2) కాలిన ఇనుప కడ్డీను చేతులతో పట్టుకోవటము ద్వార 3) నిప్పల మీద నడువుట ద్వార నేర నిర్ధారణ జరుగుతుంది.

కుల పంచాఇతిలో వివాదాలు పరిష్కరించటమే కాకుండా స్థానిక సంఘములో ఐక్యమత్యమును మరియు వ్యక్తిగత ప్రవర్తన పరిశీలన జరుగుతుంది. ఎవరైన కుల పంచాఇతిను అతి క్రమించితే వారికి కుల భహిష్కరణ చేస్తారు.

ఆహర అలవాట్లు

ఎరుకుల ప్రజలు మాంసహరులు, భియ్యము, పప్ప దినుసులు ఆంధ్ర ప్రాంతాలలో భుజిస్తారు. రాగి జావ, భియ్యము రాయలశీమ , తెలంగాణ ప్రాంతాలలో భుజిస్తారు.సాంప్రదాయకముగా చాపలు అల్లటము, పశు పోషణ, పందుల పెంపకము, బుట్టలు తయారు చేయటము, చీపుర్లు తయారు చేయటము తమ వృత్తిగా కోనసాగిస్తారు. మరియు చిన్న వ్యాపారాలు చేస్తారు . ఎరుకుల స్త్రీలు భవిషత్తు వాణి చెప్పటములో ప్రత్యేకముగా ఉంటారు మరియు కుటుంబ పాలనలో తెలివి గా ఉంటారు.

——

మీ ప్రశ్నలు పంపండి :: yerukula1@gmail.com

——–

ఉచిత ఫోన్ నంబర్: ఆరోగ్యానికి :: 1800-11-1234
ఉచిత ఫోన్ నంబర్: వ్యవసాయ :: 1800-425-1551
ఉచిత ఫోన్ నంబర్: ధాన్యం ధరలు కోసం :: 1800-425-2977
ఉచిత ఫోన్ నంబర్:ST కమిషన్ సహాయం కోసం:1800117777, http://ncst.nic.in
రక్త కోసం ఉచిత ఫోన్ నంబర్ ::1910
ఉచిత ఫోన్ నంబర్ చిన్న పరిశ్రమ కోసం :: 1800-180-6763

—–

అవసరము కలిగిన మీ కుటుంబానికి సహాయం చేయండి :ఇక్కడ ప్రచురించడానికి మీ ఫోన్ నంబర్ మరియు చిరునామా తెలియజేయండి

ఉదాహరణకు ->సంప్రదించండి :

ఆరోగ్య సహాయం కోసం:

Dr.Thokala Rama prasadrao,cell No:8985064375:
వివాహం సహాయం కోసం:తోకల సాంబశివరావు::9866215817
విద్య సహాయం కోసం :www.etdes.in
న్యాయ సహాయం కోసం:

ఉపాధి  సహాయం కోసం:

ST స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్మించడానికి  మరియు కేంద్ర సహాయం కోసం  ఆసక్తిగల వ్యక్తులు సంప్రదించండి( Govt.of India, F.No.22040/11/2014-NGO,Ministry of Tribal welfare)

—————-

చూడండి:1) http://www.youtube.com/watch?v=1LHaCPW93UM,

2) http://player.mashpedia.com/player.php?q=Gde0RRH7Yn0

3) వివిధ శాఖలఆదేశాలు కోసం::http://goir.ap.gov.in

4) http://www.telanganapradeshyerukalasangam.com

5)  http://www.wcd.nic.in/crecheandhra.htm

6)  ADIVASI EMPLOYEES WELFARE SOCIETY: http://www.aadivasi.com

7) NATIONAL ADIVASI COUNCIL: http://ascsouthindia.org/

8)ఎరుకుల హక్కుల పొరట సమితి::వలిగి ప్రభాకర్::9000855168, 9849455168

9) A.P. SHEDULED TRIBE EMPLOYEES ASSOCIATION,ADDRESS:(opp)Innova hospital, Moula-li Road,Tarnaka, secunderabad:17, President: E.Anjeneyulu , cell no:9440880344, Secretary:P.Venkata Ramana, cell No:9441063633

 • చదవండి:మాస పత్రికలుఆదివాసి గొంతుకఎడిటర్

  “ఆదివాసి గొంతుక”

  H.No.2-92,గొపాలపుర్ (గ్రా),kothaguda (M)

  వరంగల్-506135,cell no:9441897867,9441966756

  e-mail:adivasigonthuka@yahoo.com

  —–

  కుల నిర్ములన;

  ఎడిటర్

  కుల నిర్ములన,

  మల్లికార్జున నగర్,H.No:2-78, ఉప్పల్ డిపొ

  హైదెరాబాద్-39,cell no;9959567818

  e-mail: kulanirmulana@gmail.com,

  website: kulanirmulana.wordpress.com

Advertisements

Hello world!

This is your very first post. Click the Edit link to modify or delete it, or start a new post. If you like, use this post to tell readers why you started this blog and what you plan to do with it.

Happy blogging!